![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం(Jayam )'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-302 లో.. రంగా, గంగ, ఇంట్లో ఉండగా రుద్ర వచ్చి.. ఏంటి ఇంకా లేట్ అని అడుగుతాడు. ప్రమీల అక్క వంట చేస్తుందని గంగ చెప్తుంది. అదేంటి నువ్వు వంట చేయలేదా అని రుద్ర అడుగుతాడు. లేదు సర్ నేను చేశాను.. కానీ అక్క ఏదో స్పెషల్ వంట చేస్తుందని గంగ అంటుంది. ఇక రుద్ర కిచెన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ప్రమీల పాలకూర కట్ చేస్తూ ఉంటుంది. ఏంటి ప్రమీల సూపర్ మార్కెట్ కి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నావని రుద్ర అడుగుతాడు. కార్తీక్ గారి కోసం పాలకూర చేస్తున్నానని ప్రమీల చెప్తుంది. ఎందుకని రుద్ర అడుగుతాడు. కార్తీక్ గారు ఒక్కరే ఉన్నారుగా సరిగ్గా తినడం లేదు. అందుకనే తన కంటికి మంచిదని, క్యారెట్, పాలకూర, ఆకుకూరలు తీసుకెళ్ళాలని అనుకున్నానని ప్రమీల ఎమోషనల్ అవుతుంది.
భాను దూరం అయినా అతని ప్రేమ ఎప్పుడూ నీతోనే ఉంటుందని రుద్ర చెప్తాడు. ప్రమీల ఎమోషనల్ అవుతుంది. తొందరగా వంట చేసి సూపర్ మార్కెట్ కి వెళ్ళమని రుద్ర చెప్పి వెళ్తాడు. వాళ్ళు కలుస్తారా బావ అని రంగా అంటాడు. ఎలాగైనా వాళ్ళిద్దరి పెళ్ళి చేయాలని రుద్ర అంటాడు. రంగా, రుద్రణ గంగా మాట్లాడుకున్నాక అప్పుడే వీరు వస్తుంటాడు. అతని దగ్గరికి రుద్ర వెళ్ళి.. నీ టెన్షన్, నీ తాపత్రయం అర్థమైంది వీరు.. రేపో, మాపో ప్రీతీ డెలివరీ అవుతుంది. అప్పుడు ఈ ఇంటిఆడపడుచు ఈ ఇంటికి రావాలి.. ఆశీర్వదించాలని అనుకుంటున్నావ్ కదా అని వీరు అంటాడు. వీరు సైలెంట్ గా ఉంటాడు. ఇక వీరుకి సైలెంట్ గా వార్నింగ్ ఇస్తాడు రుద్ర. నీ వార్నింగ్ నాకు అర్థమైంది రుద్ర కానీ ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు అని వీరు అంటాడు. వీరు అలా అనడం రంగా, గంగా వింటారు. వాళ్ళని వీరు చూసి. విన్నారా.. వింటే విననివ్వు అని అనుకొని వెళ్లిపోతాడు. చెల్లి వదిలెసెయ్ .. బావ చూసుకుంటాడని రంగా అంటాడు. మీ బావ కృష్ణుడి లెక్క.. కానీ నేను సత్యభామ లెక్క.. ఇప్పుడే పగతీర్చుకుంటా అని గంగ అంటుంది. ఏం చేస్తావని రంగా అడుగుతాడు. ఇక తను ఒక ప్లాన్ చెప్తుంది.
మరోవైపు ఇషిక, సూర్య ఇద్దరు ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవుతారు. అప్పుడే వీరు వస్తాడు. ఏంటి ఇద్దరు ఫుల్ హ్యాపీగా ఉన్నారని అడుగుతాడు. ఆ ఏఆర్ కంపెనీతో ఈ రోజు డీల్ ఫైనల్ చేసుకోవాలని వెళ్తున్నామని సూర్య, ఇషిక అనగానే ఇద్దరికి వీరు కంగ్రాట్స్ చెప్తాడు. నువ్వు కూడా ఖాళీగా ఉండకుండా మా కంపెనీలో జాయిన్ అవ్వమని సూర్య అనగానే ఒక్క డీల్ వస్తుందనే అంత పొగరు వచ్చిందా సూర్య.. అది ఫేక్ అని తెలిస్తే. నీ పొగరు అంతా దిగిపోతుందని వీరు అనుకుంటాడు. రంగా, గంగా ఇద్దరు కలిసి లాఫింగ్ గ్యాస్ ప్రిపేర్ చేస్తారు. అది వీరు ఫేస్ కి దగ్గరగా వెళ్ళి అతను చూడకుండా కొడతారు. దాంతో వీరు కంటిన్యూ గా నవ్వుతూనే ఉంటాడు. పెద్దసారుకి బాగుండటం లేదు హాస్పిటల్ కి తీసుకెళ్ళాలని శకుంతల చెప్తుంటే వీరు నవ్వుతూనే ఉంటాడు. ఇక ఎవరు మాట్లాడినా వీరు నవ్వుతూనే ఉంటాడు. అసలు విషయం తెలుసుకున్న రుద్ర కొన్ని నీళ్ళు తీసుకొచ్చి వీరు ముఖం మీద కొడతాడు. అతడిని ప్రీతీ గదిలోకి తీసుకెళ్తుంది. మరోవైపు ఇషిక, సూర్య ఇద్దరు ఏఆర్ కంపెనీకి వెళ్తారు. అప్పుడే అక్కడ ఏఆర్ కంపెనీ ఏండీ వేరే వాళ్ళతో డీల్ కుదుర్చుకుంటాడు. ఎందుకు అలా చేశావని సూర్య, ఇషిక అడుగగా.. మీరు మాకు ఫ్రాడ్ చేయాలని చూసారు.. ఇదిగో మీరు చేసిన సంతకాలు అని ఆ ఎండీ చూపించగానే ఇషిక, వీరు షాక్ అవుతారు. మరి మా పెట్టుబడి అయిదు కోట్లు మాకు ఇవ్వండి అని సూర్య అనగానే అలా ఇవ్వడం కుదరదు.. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేముందు చూస్కోవాలి కదా అని అతను అనడంతో ఆ సంతకాలు మేము చేయలేదు.. మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారంటూ సూర్య ఫుల్ ఫైర్ అవుతాడు. ఇక ఆ ఎండీ, సూర్యల మధ్య గట్టిగా గొడవ జరుగుతుంది. ఇషిక, సూర్య కంపెనీ బయటకి వచ్చి ఫీల్ అవుతారు. నువ్వు చెప్పడం వల్లే ఈ డీల్ కి ఒప్పుకున్నాను.. రుద్ర అన్నయ్య అప్పుడే చెప్పాడు.. నేనే వినలేదని సూర్య అంటాడు. కూల్ సూర్య అని ఇషిక అంటుంది. ఇది నువ్వు సాల్వ్ చేయాలని సూర్య అనేసి వెళ్ళిపోతాడు. మరోవైపు లాఫింగ్ గ్యాస్ స్ప్రే బాటిల్ పట్టుకొని రంగ, గంగా దగ్గరికి రుద్ర వస్తాడు. ఎందుకిలా టైమ్ వేస్ట్ చేస్తున్నావ్.. బాక్సింగ్ కి ప్రిపేర్ అవ్వమని రుద్ర అనగానే సరే అని గంగ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |